![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -442 లో....అపర్ణ తన గదిలోకి వెళ్లి బాధపడుతుంటే అప్పుడే సుభాష్ వస్తాడు. తనేదో చిన్నపిల్ల తన మాటలు పట్టించుకొని బాధపడకని సుభాష్ అనగానే మరి మీరు చేసిన పనికి బాధపడకుండా ఎలా ఉంటారు. కళ్యాణ్ వాడు నా చేతుల్లో పెరిగాడు తప్పు చేసే మనిషి కాదు. ఆ ధాన్యలక్ష్మి నా ముందు మాట్లాడాలంటేనే భయపడుతుంది కానీ తన కోడలితో కలిసి అసలు ఎలా మాట్లాడుతుంది. దానికి కారణం మీరే కదా. అప్పుడు నేనేం మాట్లాడినా నీ భర్త గురించి చూసుకొని.. ఇక్కడ మాట్లాడాలి అంటారు. నా మొహం ఎక్కడ పెట్టుకోవాలని అపర్ణ అంటుంది.
మరోకవైపు కావ్య దగ్గరికి రాజ్ వెళ్లి.. అసలు నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? ఏం చెయ్యాలనుకుంటున్నావు? ఏం చేస్తున్నావ్ మాయ అంటూ పోయావ్.. మా అమ్మ అలా అవ్వడానికి కారణమయ్యావ్.. ఇప్పుడు ఇంట్లో పెద్ద గొడవ జరగడానికి కారణం నువ్వని రాజ్ కావ్యకి దగ్గరగా వెళ్తుంటే.. ఏంటి దగ్గరికి వస్తున్నారంటూ కావ్య సిగ్గుపడుతుంది. ఆ తర్వాత మాయ పంపిన వీడియో గురించి రాజ్ కి కావ్య చెప్తుంది. ఆ విషయం మరి అందరి ముందు చెప్పొచ్చు కదా అని రాజ్ అంటాడు. ఆ వీడియో ఉన్న ఫోన్ రౌడీ తీసుకొని వెళ్ళాడు. ఆధారం లేకుండా వాళ్ళు ఎలా నమ్ముతారని కావ్య అంటుంది. మనమిద్దరం కలిసి ఆ మాయని తీసుకొని వెళ్లిన రౌడీలను పట్టుకొని మాయని తీసుకొని వద్దామని కావ్య అనగానే.. రాజ్ సరే అంటాడు. మరోవైపు నువ్వు సూపర్ అనామిక అనుకున్నట్టుగా వర్క్ పర్ఫెక్ట్ గా చేసావని రుద్రాణి అనగానే.. నాదేముంది అంటీ.. మీరు హెల్ప్ చేశారని అనామిక అంటుంది. అప్పు, కళ్యాణ్ లు ఇక అసలు కలవరని రుద్రాణి అంటుంది. నువ్వు కళ్యాణ్ ని హ్యాపీగా చూసుకో గొడవ పెట్టుకోకని రుద్రాణి చెప్తుంది. ఆ తర్వాత అనామిక వెళ్ళిపోయాక నువు ఏంటి మమ్మీ గొడవ పెట్టుకోవద్దని చెప్పావని రాహుల్ అంటాడు. అది అన్ని రివర్స్ చేస్తోంది గొడవ వద్దంటే ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటుంది. అందుకే అలా చెప్పానని రుద్రాణి అంటుంది.
మరొకవైపు అప్పు ని కనకం తిడుతుంది. ఎన్నిసార్లు వద్దని చెప్పినా తనతో తిరిగి నీ పరువు తీసుకుంటావని కనకం అంటుంది. నువ్వు పెళ్లి కావల్సిన దానివి.. నీకూ పెళ్లి అయ్యాక ఈ విషయం నీ భర్తకి తెలిస్తే ఎలా ఉంటుందని కనకం అనగానే.. అర్థం చేసుకోలేని భర్త దొరికేతే అసలు పెళ్లి చేసుకోనని అప్పు అంటుంది. ఆ తర్వాత అనామిక కళ్యాణ్ తో మాట్లాడాలని ట్రై చేస్తుంది. ఎవరో మమ్మల్ని కావాలనే ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారు.. లేదంటే కరెక్ట్ మీడియా వాళ్ళ ఎందుకు వస్తారు. వాళ్ళెవరో కనిపెడుతానని కళ్యాణ్ అనగానే.. అనామిక టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత రాజ్, కావ్య లు బయటకు వెళ్తారు. అప్పుడే మాయ తప్పించుకుందని రుద్రాణికి రౌడీ ఫోన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |